రైల్వే అనగానే ప్రయాణమే కాదు ప్రమాదాలు గుర్తుకొస్తాయి. దేశంలో అతి ముఖ్యమైన రవాణ సదుపాయం రైల్వే. అయితే ఈసారి రైల్వే రికార్డులను తిరగరాసింది. రైల్వే ప్రమాదాల్లో ఈసారి ఒక్కరు కూడా మరణించలేదని ప్రకటించింది. కానీ కొన్ని ప్రమాదాల్లో తమ సిబ్బంది మాత్రం చనిపోయారని నివేదిక ఇచ్చింది. గత యేడాదితో పోలిస్తే… రైలు ప్రమాదాలు కూడా తగ్గాయని స్పష్టం చేసింది.
రైలు ప్రమాదాల వల్ల 2016-17 సంవత్సరానికి 20మంది, 2017-18లో 10మంది, 2018-19లో ముగ్గురు మరణించగా ఈ ఏడాది ఎవరూ చనిపోలేదని రైల్వే శాఖ లెక్కలు విడుదల చేసింది. కానీ కొన్ని గూడ్స్ రైల్లు పట్టాలు తప్పటంతో కొన్ని ప్రమాదాలు జరిగాయని వాటిలో 33మంది ప్రయాణికులు గాయపడగా, కొంతమంది రైల్వే ఉద్యోగులు మరణించారని ప్రకటించింది.
సింహాచల్ ఎక్స్‌ప్రెస్, ఛప్రా-సూరత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడం, హైదారాబాద్-న్యూఢిల్లీ, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ప్యాంట్రీ అగ్ని ప్రమాదం వంటి ఘటనలు జరిగాయని, కాచిగూడ రైల్వే ప్రమాదంలో రైల్వే సిబ్బంది ఒకరు చనిపోగా 16మంది ప్రయాణికులు గాయపడ్డారని నివేదికలో పేర్కొంది. కానీ తమ జాగ్రత్త వల్ల ట్రాక్‌లపై మరణాల రేటును పూర్తిగా నివారించగలిగామని రైల్వే ప్రకటించింది.