ఆఫ్రికా దేశాల్లో జింబాబ్వే అనుభవిస్తున్న దరిద్రపు పరిస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తమ కరెన్సీ లో లక్ష డాలర్ల నోటు కనిపెట్టినా సరే ఇప్పటి వరకు ఆ దేశం ఆర్ధిక కష్టాల నుంచి ఆహార కష్టాల నుంచి బయటకు రాలేదు అనే మాట వాస్తవం. ఇక ఇప్పుడు ఆ దేశంలో మరో దరిద్రపు పరిస్థితి వెలుగు చూసింది. 13 ఏళ్ళు నిండకుండానే తల్లి కావడం ఆ తర్వాత కుటుంబ భారం మోయడం ఆ దేశంలో కామన్ గా మారిపోయింది. బాల్య వివాహాల నుంచి, క్రమంగా ఊహకు అందని పెరుగుతున్న గర్భాల నుంచి ఎలా బయటకు రావాలో ఆ దేశానికి అర్ధం కావడం లేదు.
స్కూల్ కు వెళ్ళాల్సిన వయసులో అక్కడి బాలికలపై క్రమంగా అత్యాచారాలు జరగడం, గర్భం దాల్చడం వంటివి జరుగుతున్నాయి. 16 ఏళ్ళ వయసు లోపు ఉన్న బాలికలపై ఎటువంటి లైంగిక వేధింపులు జరిగినా పదేళ్ళ కఠిన కారాగార శిక్ష అనే చట్టం ఉన్నా సరే ఎవడూ పట్టించుకోవట్లేదట. ఇటువంటి గర్భాలు మరియు బాల్య వివాహాలతో జింబాబ్వే చాలా కాలంగా పోరాడుతోంది. కరోనాకు ముందు దేశంలోని ప్రతి ముగ్గురు అమ్మాయిలలో ఒకరు 18 ఏళ్లలోపు వివాహం చేసుకున్నారు.
చాలా మంది 13 ఏళ్ళ లోపు వయసు ఉన్న వారే. వారిలో దాదాపు అందరూ గర్భం దాల్చినట్టుగా అక్కడి లెక్కలు చెప్త్హున్నాయి. ఇరుకైన గదులతో పాటుగా ఆహార పోరాటం లో భర్తలను కోల్పోయి 15 ఏళ్ళు కూడా రాకుండానే భర్తను కోల్పోయిన బాలికల సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఆ దేశ గణాంకాలు చెప్తున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందని ఆ దేశ స్వచ్చంద సంస్థలు చెప్తున్నాయి. 15 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో మార్చి 2020లో కఠినమైన లాక్‌డౌన్ విధించారు.
ఆరు నెలల పాటు పాఠశాలలను మూసివేసి, వాటిని అడపాదడపా మాత్రమే తిరిగి ఓపెన్ చేసారు. ఈ క్రమంలో క్లీనిక్ లను కూడా క్లోజ్ చేయడంతో గర్భాలు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా మంది బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఇక వ్యభిచార వృత్తిలోకి వెళ్ళిన వాళ్ళను కూడా గర్భం వేధిస్తుందని… సరైన రక్షణ మార్గాలు లేక గర్భం చేసి వదిలేస్తున్నారని పేదరికం నుంచి బయటపడటానికి అందుకు కూడా అక్కడి బాలికలు ఒప్పుకుంటున్నారు అని స్వచ్చంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఆఫ్రికాలో ఉన్న మరికొన్ని దేశాల్లో కూడా ఇదే విధంగా పరిస్థితి ఉందని లెక్కలు చెప్తున్నాయి. కరోనా సమయంలో సమయంలో, బోట్స్వానా, నమీబియా, లెసోతో, మలావి, మడగాస్కర్, దక్షిణాఫ్రికా మరియు జాంబియా వంటి దేశాల్లో లైంగిక వేధింపుల కేసులు పెరిగాయని లెక్కలు చెప్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ప్రపంచంలోని కౌమారదశలో ఉన్నవారిలో అత్యధిక గర్భధారణ రేటు ఆఫ్రికాలో ఉందని చెప్తున్నారు. ఆమె 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డకు వివాహం చేయడాన్ని అక్కడి తల్లి తండ్రులు ఇష్టపడుతున్నారని ఐఖ్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది.