ఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వ్యవస్థను డెవలప్ చేసే ప్రాసెస్‌లో జొమాటో సంస్థ 541 మంది ఉద్యోగులను ఇళ్లకు పంపించేస్తోంది. ఇండియాలో వున్నఫుడ్ డెలివరీ సంస్థల్లో జొమాటోకి మంచి పేరు ఉంది.
చాలా మంది ఇందులో పనిచేస్తున్నారు. దేశ వ్యాప్తంగా సపోర్టు టీమ్‌లో పనిచేస్తున్న 541 మందిని సంస్థ తొలగించనుంది. కాకపోతే, కాస్త గడువు కూడా ఇచ్చింది. ఇప్పుడిప్పుడే వారిని బయటకు పంపించడం లేదని, మరో మూడు నెలలు ఇక్కడే పనిచేసే ఛాన్స్ ఇస్తామని..2020 జనవరి వరకు తొలగించిన సిబ్బంది ఫ్యామిలీకి బీమా సౌకర్యం కూడా కల్పిస్తామని వెల్లడించింది.
గత కొన్ని నెలల నుంచి సంస్థకు భారీగా ఆర్డర్స్ రావడం..డెలివరీ చేయడంలో ఫెయిల్ అవుతుండడం జరుగుతోందని తెలిపింది. టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నిర్ణయించి..దానిని పరీక్షించడం జరిగిందని తెలిపింది. ఆర్డర్ సంబంధించి ప్రశ్నలన్నింటికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానాలు చెప్పదలిచినట్టు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ప్రస్తుతం ఇంటికి పంపిస్తున్న ఉద్యోగుల సంఖ్య 10 శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం తమ ఆర్డర్లకు 7.5 శాతం సపోర్టు మాత్రమే అవసరమని, ఇది మార్చిలో 15 శాతంగా ఉందని స్పష్టం చేసింది.