ఓవైపు దూకుడు మీదున్న కాంగ్రెస్.. ఇంకోవైపు స్పీడ్ పెంచిన బీజేపీ… రెండు పార్టీలు ముప్పేట దాడి చేస్తుండడంతో టీఆర్ఎస్ చుక్కలు కనపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఏకంగా జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి రాజీనామా చేశారు.
మంత్రి మల్లారెడ్డి ఒంటెద్దు పోకడలకు నిరసనగానే టీఆర్ఎస్ ను వీడినట్లు తెలిపారు శరత్ చంద్రారెడ్డి. తమను సంప్రదంచకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కమిటీలో తమ వర్గం వారికి చోటివ్వడం లేదని మండిపడ్డారు.